close

తాజా వార్తలు

Updated : 23/05/2020 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో మరో 47 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,136 మంది నమూనాలు పరీక్షించగా 47 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,561కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 5 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. కోయంబేడు కేసుల్లో చిత్తూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో రెండు ఉన్నాయి.

కరోనా బారి నుంచి కోలుకుని ఇప్పటి వరకు మొత్తం 1,778 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 727 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 56కు చేరింది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని