సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

హైదరాబాద్‌: కరోనా నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కేసీఆర్‌కు నెగెటివ్‌ నిర్ధరణ అయ్యింది. స్వల్ప లక్షణాలతో ఏప్రిల్‌ 19న సీఎం కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఏప్రిల్‌ 21వ తేదీన సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేశారు. సీటీ స్కాన్‌లో ఛాతీలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేనట్టు తేలిందని వైద్యులు తెలిపారు. గత వారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్ వచ్చినా అనంతరం నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కచ్చితమైన ఫలితం రాలేదు. తాజాగా మరోసారి పరీక్షలు నిర్వహించగా యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌, రక్తపరీక్షల నివేదికలు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు నిర్ధరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని