చిత్రహింసలకు గురి చేశారు: నల్లమిల్లి
close

తాజా వార్తలు

Updated : 20/03/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్రహింసలకు గురి చేశారు: నల్లమిల్లి

రాజమహేంద్రవరం: కక్షసాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతిని బయటపెట్టినందుకే కక్ష సాధిస్తున్నారన్నారు. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నల్లమిల్లిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఆయన బెయిల్‌పై రాజమహేంద్రవరం కారాగారం నుంచి విడుదలయ్యారు. మెరుగైన వైద్యం అందించకుండా చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతారా? అని నల్లమిల్లి ప్రశ్నించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని