మరోసారి ఫోక్‌ సాంగ్‌తో అదరగొడతారా?
close

తాజా వార్తలు

Published : 15/05/2020 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి ఫోక్‌ సాంగ్‌తో అదరగొడతారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఈ ముగ్గురు కలిశారంటే ఆ మేజిక్‌ వేరు. ‘ఆర్య’తో మొదలైన వీరి ప్రయాణంలో ‘ఆర్య2’ అలరించింది. ఇప్పుడు ‘పుష్ప’ కోసం మళ్లీ చేతులు కలిపారు. ఇక బన్ని-సుకుమార్‌-డీఎస్పీ సినిమా అంటే సాంగ్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఓ మాస్‌ బీట్‌ ఉంటుంది.

ఇప్పుడు ‘పుష్ప’ కోసం దేవి శ్రీ ఓ మాస్‌ బీట్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.  అందులో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటిస్తుందని ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్తూరు ప్రాంతానికి సంబంధించి, అధిక భాగం అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనుంది. అక్కడి పరిస్థితుల్ని, ప్రజల జీవన విధానాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. దానికి తగ్గట్లు జానపదాల్ని వినిపించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందని టాక్‌. కథలో భాగంగా గిరిజనుల జానపదల గీతాన్ని తెరపై చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ‘రంగస్థలం’లో ‘జిగేల్‌ రాణి’ పాటతో అదరగొట్టిన సుక్కు-దేవి ‘పుష్ప’ కోసం ఎలాంటి ఫోక్‌ సాంగ్‌తో అలరిస్తారో చూడాలి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని