close

తాజా వార్తలు

Published : 27/05/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐస్‌క్యూబ్‌తో అందంగా..

ఎండలకి చెమటలు కారిపోతున్నాయి. చర్మంపై జిడ్డు చికాకు పెడుతోంది. దీన్ని నియంత్రించడానికి సహజంగా తయారుచేసిన ఈ ఐస్‌క్యూబ్స్‌ అదిరే ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందామా?  
నిమ్మరసం+ గులాబీనీరు: జిడ్డు చర్మతత్వం ఉన్నవారు నిమ్మరసంలో రెండు చెంచాల గులాబీ నీళ్లు కలుపుకోవాలి. అందులో దూదిని ఉండలుగా చేసి ముంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. బయట నుంచి తిరిగి రాగానే వాటితో ఓ సారి రుద్దుకుంటే చర్మం పునరుత్తేజం చెందుతుంది.
గులాబీ రేకలు+తేనె: రసాయనాలు వేయకుండా పెంచిన గుప్పెడు గులాబీరేకల్ని ముద్దగా నూరుకోవాలి. దానిలో కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎండలోకి వెళ్లి తిరిగి వచ్చాక ప్యాక్‌లా వేసుకుంటే...చర్మానికి తేమ అంది తాజాగా మారుతుంది.

టొమాటోలు+పంచదార+పుదీనా: టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఐస్‌ట్రే అరల్లో వేయాలి. వాటిలో కొద్దిగా పంచదార, ఓ పుదీనా ఆకు, కాసిని నీళ్లు కలిపి డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. అవి గడ్డలుగా అయ్యాక మెత్తటి శుభ్రమైన కాటన్‌ వస్త్రంలో పెట్టి ముఖానికి అద్దుకుంటే...ఎండకి కందిన చర్మం తిరిగి మామూలు స్థితికి వస్తుంది. చర్మానికి నిగారింపు వస్తుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని