close

తాజా వార్తలు

Published : 03/09/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లి చేసుకున్నాడు కానీ కాపురం చేయడం లేదు!

నాకు ఈ మధ్యే పెళ్లయ్యింది. సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బాధపడుతున్నా. మావారు నన్ను ఇప్పటివరకూ తాకనేలేదు. నాతో ప్రేమగా కూడా ఉండరు. పెళ్లికి ముందే ఈ విషయాన్ని గమనించా. మా ఇంట్లోవాళ్లకి చెబితే వాళ్లు నెమ్మదస్తుడు అయి ఉంటాడని సర్దిచెప్పారు. కానీ ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. అత్తామామలకు చెబితే.. పెళ్లికి ముందే నీకు వేరే వాళ్లతో సంబంధం ఉండి ఉంటుంది. అందుకే మావాడిపై నిందలు వేస్తున్నావని తిరిగి నన్నే అంటున్నారు. ఇక, నా భర్త ఈ విషయం ఎవరితోనైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం లేదా?

- ఓ సోదరి

మీ ఇద్దరిమధ్య వైవాహిక సంబంధం సరిగా లేదంటున్నారు. దానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేశారా? సాధారణంగా... మీమీద ఇష్టం లేకుండా పెళ్లిచేసుకోవడం, లేదా ఎవరినైనా ప్రేమించి ఉండటం.. అది పెద్దవాళ్లకు తెలియచేయడానికి భయపడటం, సంసారం చేయడానికి భయపడటం అంటే ఏదైనా శారీరక లోపంతో దగ్గరకు రాకపోవడం వంటివి కారణాలై ఉంటాయి. అతనికి దగ్గర కావడానికి మీరేమైనా ప్రయత్నాలు చేశారా? అయినప్పటికీ మీ భర్తలో మార్పు రాలేదంటే ఆలోచించాలి. ఎవరికీ చెప్పుకోకపోతే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. వీలైతే ముందు అతడిని ఫ్యామిలీ కౌన్సెలర్‌ లేదా మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. సాధారణంగా పెళ్లి అయిన తరువాత లైంగిక సంబంధం లేకపోతే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 12(1)ఎ కింద ఆ పెళ్లిని రద్దుచేయమని కోరే హక్కు ఆ భార్యకు లేదా భర్తకు ఉంది. కానీ అలా రద్దుపరచాలని అడగాలంటే అతడికి లైంగిక సామర్థ్యం లేదని తేలాలి. అలాకాకుండా కేవలం ఇష్టంలేక మీ దగ్గరకు రాకపోతే ఈ సెక్షన్‌ చెల్లదు. అలానే సెక్షన్‌ 13 కింద లైంగికంగా దూరం పెడుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని చెబుతూ (క్రూరత్వం కింద) విడాకులు కోరవచ్ఛు అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడో ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది పెద్దవాళ్ల ద్వారానే సాధ్యమవుతుంది. అవన్నీ చేసినా ఫలితం లేదనుకున్నప్పుడు ఓ లాయర్‌ని సంప్రదించండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని