close

తాజా వార్తలు

Published : 01/01/2020 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీ స్టైల్‌లో రనౌట్: వీడియో వైరల్

మెల్‌బోర్న్‌: బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్ ఆటగాడు పీటర్‌ సిడిల్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తరహాలో అతడు వికెట్లను గిరాటేయడంతో సామాజిక మాధ్యమాల్లో వీడియో చక్కర్లు కొడుతోంది. అడిలైడ్‌ స్ట్రైకర్స్×సిడ్నీ థండర్ మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. సిడిల్‌ వేసిన 14వ ఓవర్‌లో సిడ్నీ బ్యాట్స్‌మన్ ఉస్మాన్‌ ఖవాజా పరుగు కోసం ప్రయత్నించాడు. అడిలైడ్‌ ఫీల్డర్‌ వెస్ అగర్‌ బంతిని అందుకొని వికెట్లకు కాస్త దూరంగా త్రో విసిరాడు. దీంతో సిడిల్‌ బంతిని పట్టుకుని చాకచక్యంతో ధోనీలా వికెట్లను చూడకుండానే బెయిల్స్‌ను గిరాటేశాడు. అప్పటికీ ఖవాజా క్రీజులోకి రావకపోవడండో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు.

ఈ వీడియోను బీబీఎల్‌ తమ ట్విటర్‌లో పోస్ట్ చేయగా సిడిల్‌.. ధోనీ స్టైల్‌లో రనౌట్‌ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్‌ 165 పరుగులకే పరిమితమైంది. బీబీఎల్‌లో అడిలైడ్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సిడిల్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.