కొత్త డాట్సన్‌ రెడి-గో కారు
close

తాజా వార్తలు

Published : 03/06/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త డాట్సన్‌ రెడి-గో కారు

దిల్లీ: నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తన డాట్సన్‌ రెడి-గో మోడల్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ధరల శ్రేణి రూ.2.83  -  4.77 లక్షలు (ఎక్స్‌షోరూం- దిల్లీ). 0.8 లీటర్‌ పెట్రోలు, 1 లీటర్‌ పెట్రోలు ఇంజిన్‌ వేరియంట్లలో ఇది లభ్యం అవుతుందని కంపెనీ తెలిపింది.  యువత అభిరుచికి తగ్గట్లుగా అత్యుత్తమ నాణ్యతతో, జపాన్‌ సాంకేతికతతో తీర్చిదిద్దినట్లు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టరు రాకేశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఎల్‌ ఆకారంలో పగటి పూట కూడా వెలిగే లైట్లు, ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌, 14 అంగుళాల చక్రాలు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటెయిన్‌ సిస్టమ్‌, డ్యుయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ప్రొజెక్షన్‌ గైడ్‌తో రేర్‌ వ్యూ కెమేరా లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని