close

తాజా వార్తలు

Updated : 09/06/2020 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీలాంటి కస్టమర్‌ను కోల్పోవడమే ఆనందం

వాషింగ్టన్ డీసీ : తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఓ కస్టమర్‌ పంపిన మెయిల్‌ను అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కస్టమర్‌ను ఉద్దేశిస్తూ.. ‘నీలాంటి కస్టమర్‌ను కోల్పోవడం ఆనందంగా ఉందని’ ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని మినియాపొలిస్‌లో ఓ భద్రతాధికారి చేతిలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ జాతివివక్షపై కొద్ది రోజులుగా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమానికి అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ కూడా మద్దతు ప్రకటించారు. దీంతో జెఫ్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఓ కస్టమర్‌ ఈ-మెయిల్ పంపాడు. డేవ్‌ పేరుతో వచ్చిన ఆ మెయిల్‌లో ‘మీ కంపెనీ ద్వారా ఓ ఆర్డర్‌ పెట్టాను.‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు మీరు మద్దతిచ్చిన విషయం తెలిసింది. నా ఆర్డర్‌ను రద్దు చేసుకుంటున్నా. నేను మాత్రమే కాదు వాస్తవానికి ఇంకా చాలా మంది చేసుంటారు’ అంటూ మెయిల్‌ పంపించాడు. ఎంతోమంది నాపై అయిష్టత వ్యక్తం చేస్తున్నా.. ఈ తరహా విద్వేషాన్ని చీకట్లో దాచిపెట్టడం మంచిది కాదని భావించానని జెఫ్‌ పేర్కొన్నారు. ఇలాంటివి అందరికీ తెలిసేలా చేయాల్సిన అవసరముందన్నారు. ఇది సమస్యకు ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ‘డేవ్‌ నీలాంటి కస్టమర్‌ను కోల్పోవడం ఆనందంగా ఉందని’ జెఫ్‌ వ్యాఖ్యానించారు.  

కొద్ది రోజుల క్రితం కూడా జెఫ్‌ బెజోస్‌ ఓ ఈ మెయిల్‌కు బదులిస్తూ అమెరికాలో జరుగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తానని పునరుద్ఘాటించారు. ఉద్యమానికి అమెజాన్‌ అనుకూలంగా వ్యవహరించడం కలవర పరచిందని, ‘ఆల్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అని పేర్కొంటూ బెజోస్‌కు ఓ వ్యక్తి మెయిల్‌ పంపాడు. దీనిపై బెజోస్‌ స్పందిస్తూ ‘ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు జాత్యహంకారానికి సంబంధించినవి. చట్టం అమలు, న్యాయ వ్యవస్థలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవి. ఈ ఉద్యమానికి నేను మద్దతిస్తున్నా. మన చుట్టూ ఏం జరుగుతుందో చూస్తున్నాం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని’ బదులిచ్చారు. ఇటీవలే 10 మిలియన్‌ డాలర్లను సామాజిక న్యాయం కోసం పోరాడే సంస్థలకు సహాయంగా అందజేయనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.