లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు 
close

తాజా వార్తలు

Updated : 24/06/2020 09:36 IST

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను లాభాల్లో ప్రారంభించాయి. ఉదయం 9.23 సమయానికి సెన్సెక్స్‌ 222 పాయింట్లు లాభపడి 35,652 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 10,534 వద్ద కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. చైనా సరిహద్దు వివాదం సర్దుమణగనుందని సంకేతాలు రావడతో మార్కెట్లలో జోరు పెరిగింది. మరోపక్క బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎన్‌పీఏల ప్రొవిజన్లను తగ్గించినట్ల వార్తలు రావడం బ్యాంకింగ్‌ షేర్లకు బలన్ని ఇచ్చింది. నేడు మొత్తం 85 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. కెనరాబ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గెయిల్‌, ఇండియా సిమెంట్‌ వంటి సంస్థలు వీటిల్లో ఉన్నాయి. 

అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో మూడు సూచీలు నిన్న లాభాల్లో ముగియడం ఆసియా మార్కెట్లు సానుకూల సంకేతాలను పంపింది. దీంతో ఆసియాలో కూడా మార్కెట్లు లాభపడుతున్నాయి. చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని