హెల్ప్‌లైన్‌కు సమోసా కోసం కాల్‌!
close

తాజా వార్తలు

Published : 31/03/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెల్ప్‌లైన్‌కు సమోసా కోసం కాల్‌!

లఖ్‌నవూ: లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి తోడ్పడకపోయినా పర్లేదు గానీ.. ఇబ్బందులు పెట్టకుండా ఉంటే అదే పదివేలు. కానీ, యూపీలో వ్యక్తి మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆకతాయిగా వ్యవహరించాడు. తనకు సమోసా కావాలంటూ ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అట్టడుగు వర్గాలకు సహాయార్థం యూపీ ప్రభుత్వం ఓ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అయితే, రాంపూర్‌ జిల్లా అధికారులకు ఆ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు చాలా ఆకతాయి కాల్స్‌ వచ్చాయి. అందులో ఓ కాలర్‌ వారికి మరీ చిరాకు తెప్పించాడు. పదే పదే ఫోన్‌ చేసి తనకు వేడి వేడి సమోసా కావాలని అడిగాడు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్‌ ఆ వ్యక్తి అడిగినట్లే సమోసా పంపించారు. తర్వాత అతడు చేసిన ఆకతాయి పనికి అతడి చేత డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఈ విషయాన్ని సదరు అధికారి ట్విటర్‌లో పోస్ట్‌చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని