ఏపీలో తొలి కరోనా కేసు
close

తాజా వార్తలు

Updated : 11/03/2020 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో తొలి కరోనా కేసు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న బాధితుడు గత నాలుగు రోజులుగా నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. రెండో విడత పరీక్షల కోసం బాధితుడి రక్తనమూనాలను పుణె పంపించారు. ప్రస్తుతం నెల్లూరు ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులోని చిన బజారులో నివసిస్తున్న బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాధితుడి నివాస ప్రాంతంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని