close
Array ( ) 1

తాజా వార్తలు

ఆదివారం.. ఇదేం అలక్ష్యం?

కనిపించని ‘సామాజిక దూరం’
నగరంలోని మార్కెట్లు, రైతుబజార్ల వద్ద రద్దీ
ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కొందరిది అదే ధోరణి

ఈనాడు, హైదరాబాద్‌: ఆదివారం.. సాధారణ రోజుల్లో ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన సమయం.. ప్రస్తుం కరోనా వైరస్‌ ప్రబలి వణుకు పుట్టిస్తున్న దశలో మరింత జాగ్రత్తగా మెలగాల్సిన తరుణం.. కానీ, నగరవాసులు కొందరు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వైరస్‌ మనల్ని ఏం చేయదు అనే నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కిరాణ సరకులు, కూరగాయలు కొనుగోలు చేయడం కనిపించింది. సామాజిక దూరం అన్నది మరోసారి మాయమైంది. అంతేకాదు మెడికల్‌ దుకాణాలు ఎల్లప్పడూ తెరిచే ఉంచవచ్చని ప్రభుత్వం సూచించింది. మందుల దుకాణాలకు వెళ్లేవారు సైతం సామాజిక దూరం పాటించని పరిస్థితి నగరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

సరకుల కొనుగోలుకు...
ఈ నెల 23(సోమవారం) నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ముందు రోజు జనతాకర్ఫ్యూ పాటించారు. ఆ తర్వాత సోమవారం వెంటనే కూరగాయలు, సరకులు కొనుగోలు చేసేందుకు పోటెత్తారు. తర్వాత ప్రభుత్వం నుంచి గట్టి హెచ్చరికలు, కరోనావైరస్‌ గురించి మరింత ఆందోళన ఏర్పడటంతో చాలావరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితయ్యారు. ఆదివారం మరోసారి పాత పద్ధతే నగరంలో కనిపించింది. కూరగాయలు, కిరాణాదుకాణాలు కిక్కిరిశాయి. చికెన్‌, మటన్‌ ప్రియులు ఆయా దుకాణాల ముందు క్యూ కట్టారు. కొన్నిచోట్ల మాత్రం సామాజిక దూరం పాటించారు.

మాస్కులు పెట్టుకున్నా..
ప్రస్తుతం లాక్‌డౌన్‌ మరో రెండువారాలకుపైగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హోల్‌సేల్‌ మార్కెట్లు ఆదివారం రద్దీగా కనిపించాయి. ముఖానికి మాస్కులు, చేతిరుమాళ్లు కట్టుకొనే బయటకు వస్తున్నా.. సామాజిక దూరం మాత్రం పాటించడం లేదు.

గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో..
గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌కు సుదూర ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు తీసుకొస్తారు. ఇక్కడ తక్కువ ధరకు కొని.. నగరంలో రెండింతల ధరకు అమ్ముకోవాలని రిటైల్‌ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే ఎవరికి వారు ముందుగా కొనుగోలు చేయాలనే ధ్యాసే తప్పా.. కరోనా నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రిటైల్‌ వ్యాపారులతోపాటు.. కొందరు నగరవాసులు సైతం వస్తుండడంతో మార్కెట్‌ కిక్కిరిసి కనిపిస్తోంది.

రైతుబజార్లలో మాదిరి నియంత్రించాలి
మొదట్లో రైతు బజార్లలో కూడా ఇంతే రద్దీ కనిపించేది. ఈ రద్దీ నియంత్రణకు సంచార రైతు బజార్లను ప్రారంభించి కాలనీలకే కూరగాయలను పంపుతున్నారు. రైతు బజార్లలోనూ గీతలు గీసి సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ఇదేవిధంగా …గుడిమల్కాపూర్‌లో మార్కెట్‌లోనూ చేయాల్సి ఉంది. రైతులు, కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించేలా చూడాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.