close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/04/2020 08:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ముంబయి నుంచి వచ్చింది...651 మంది!!

ఈనాడు, శ్రీకాకుళం: మహరాష్ట్ర రాష్ట్రంలో కొవిడ్‌-19 తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ నుంచి జిల్లాకు వచ్చిన వారిపై దృష్టి సారించేవిధంగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మార్చి రెండు, మూడు వారాల్లో ముంబయి నుంచి ఏఏ జిల్లాలకు ఎంత మంది చేరారో సవివరంగా వివరాలు పంపించింది. ఆ మేరకు ఆదివారం జిల్లాకు 651 మంది జాబితా అందింది. వారందరి ఆరోగ్య స్థితిగతులను విచారించి కొవిడ్‌-19 బారిన పడకుండా అవసరమైన పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. వారందరి క్షేమ సమాచారంపై సోమవారం ప్రత్యేక దృష్టి సారించనుంది. వారి ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేయనుంది. ఏమాత్రం అనుమానం ఉన్నా నమూనాలను సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ జె.నివాస్‌ గ్రామాల వారీగా  కొవిడ్‌-19 ప్రత్యేక అధికారులను నియమించి అవసరమైన ఆదేశాలిచ్చారు.

రైల్వేశాఖ నుంచి: కేంద్ర రైల్వేశాఖ ఇచ్చిన వివరాల ఆధారంగా జాబితా రూపుదిద్దుకుంది. వారంతా ముంబయిలోని ఛత్రపతి శివాజీ ముంబయి టెర్మినల్‌ (సీఎస్‌ఎంటీ), లోక్‌మాన్య తిలక్‌ టెర్మినల్‌ (ఎల్‌టీటీ) రైలునిలయాల నుంచి నేరుగా బయలుదేరారు. ఏ రైలులో బయలుదేరారు, రైలు నెంబరు, ప్రయాణించిన తేదీ, ఏ రైలునిలయం నుంచి ఏ రైలు నిలయం వరకు ప్రయాణించారు.. పీఎన్‌ఆర్‌ నెంబరు, తరగతి, కోచ్‌ నెంబరు, బెర్తు నెంబరు, బుకింగ్‌ సమయం,  ప్రయాణికుడి పేరు, జిల్లా, మండలం, చిరునామా తదితర వివరాలన్నింటినీ జాబితాలో పొందుపరిచారు. జాబితా జిల్లాకు చేరిన వెంటనే కలెక్టర్‌ నివాస్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆ జాబితా ఆధారంగా ఏఏ చర్యలు తీసుకోవాలో ఆదేశాలిచ్చారు. 

కొవిడ్‌ అధికారుల నియామకం: జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కొవిడ్‌ అధికారులను నియమించారు. ముంబయి నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడిని గుర్తించి వారి పరిధిలోని వాలంటీర్, ఆశా కార్యకర్త, కొవిడ్‌ అధికారి, వారి నెంబర్లు,  ప్రత్యేకాధికారి, వైద్యులను నియమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వారిని గుర్తించిన వెంటనే ఇళ్లకు స్టిక్కర్‌తోపాటు క్యూఆర్‌కోడ్‌ అతికిస్తారు. ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయేమో.. ప్రాథమికంగా వైద్యులు పరీక్షిస్తారు. ఏమైనా అనుమానిత లక్షణాలు బయట పడితే వెంటనే జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి తరలించి అక్కడ నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తారు. 60 ఏళ్ల వయసు పైబడిన వారందరినీ ప్రతి రోజూ పరీక్షిస్తారు. వారు ఇళ్లకు వచ్చి 20 రోజుల లోపు అయితే.. వెంటనే హౌజ్‌ ఐసోలేషన్‌కు చర్యలు తీసుకుంటారు. లేదంటే ఆసుపత్రికి తరలించి నిరంతర పర్యవేక్షణలో ఉంచుతారు.  


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.