ఆ ఘటన నా హృదయాన్ని కలచివేసింది: డీజీపీ
close

తాజా వార్తలు

Updated : 18/05/2020 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఘటన నా హృదయాన్ని కలచివేసింది: డీజీపీ

అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ చిన్నారితో స్పాట్‌ వాల్యుయేషన్‌ గదిని శుభ్రం చేయించిన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఘాటుగా స్పందించారు. గది శుభ్రం చేసే సమయంలో పోలీసు హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు.

గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన ఆరేళ్ల కుమార్తెతో ఆ పని చేయించడం బాధాకరమని డీజీపీ అన్నారు. తండ్రి అయినప్పటికీ చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండని పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం నిషేధమన్నారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచి వేసిందని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని