దిల్లీపై దండెత్తిన మిడతల దండు
close

తాజా వార్తలు

Updated : 27/06/2020 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీపై దండెత్తిన మిడతల దండు

దిల్లీ: పంటలను నాశనం చేసే ఎడారి మిడతల దండు దేశరాజధాని దిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌ చేరుకున్నాయి. నగరంలోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో మిడతలు ఆకాశాన్ని కమ్మేశాయి. నగరపాలక సంస్థ అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్ల కిటికీలు మూసివేయాలని కోరారు. పాత్రలను కొట్టడంతో పాటు పెద్దగా శబ్ధాలు చేయడం ద్వారా మిడతలను నివారించే ప్రయత్నం చేశారు.

గురుగ్రామ్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ సమూహాలుగా విహరిస్తున్న మిడతల దండుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరో వైపు పురుగు మందులను పిచికారీ చేసే పంపులను రైతులు సిద్ధంగా ఉంచాలని గురుగ్రామ్‌ జిల్లా అధికారులు తెలిపారు. మిడతల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
మిడతల దండు దిల్లీ వైపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీ విమానాశ్రయం అధికారులను ఏటీసీ అప్రమత్తం చేసింది. పైలట్లు విమానాలు దిగే సమయంలో, ఎగిరే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఏటీసీ హెచ్చరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని