close

తాజా వార్తలు

Updated : 25/02/2021 07:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోలుకుంటున్న ‘చిరుత’ వీరుడు

రాజగోపాల్‌

హాసన, న్యూస్‌టుడే : చిరుత దాడిలో తలకు బలమైన గాయాలైన రాజగోపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాసన జిల్లా అరసికెరె తాలూకా బెండిగెరె వద్ద కుటుంబ సభ్యులపై చిరుత దాడిచేస్తుండటాన్ని చూసి.. ప్రాణాలొడ్డి ప్రతిఘటించిన రాజగోపాల్‌ సాహసాన్ని అన్ని వర్గాల ప్రజలూ ప్రశంసించారు. ఆ సంఘటనలో చిరుతను సంహరించిన విషయం తెలిసిందే. పోరాట వేళ చిరుత పంజా విసరడంతో తలకు, భుజంపై రాజగోపాల్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని గ్రామస్థులు తెలిపారు. చిరుతతో దాదాపు 20 నిమిషాలపాటు ఆయన వీరోచితంగా పోరాడారు. ఎన్నిసార్లు పంజాతో దాడిచేసినా రక్త గాయాల బాధను ఓర్చుకుంటూ ఏమాత్రం వెనుకంజ వేయకుండా దానిపై కట్టెతో దాడిచేసి.. చివరికి మెడను గట్టిగా అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి నేలకొరిగేలా చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుతతో పోరాడిన రాజగోపాల్‌ బాగా అలిసిపోయారని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని