నిందితులకు కరోనా..క్వారంటైన్‌కు పోలీసులు
close

తాజా వార్తలు

Published : 07/07/2020 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిందితులకు కరోనా..క్వారంటైన్‌కు పోలీసులు

రాంచీ: ఝార్ఖండ్‌లో ఇటీవల అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతణ్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసుల్ని క్వారంటైన్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం కొడెర్మా జిల్లాలోని చుటియారో గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ యూనిట్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం.. జైలుకు తరలించడానికి ముందు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్‌ తేలింది. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. మరొకరిని జైలుకు పంపారు. అలాగే రైడ్‌కు వెళ్లిన 42 మంది పోలీసుల్ని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. 

నిందితుడు ఉన్న జైలు పరిసరాలు సహా చుటియారో గ్రామాన్ని పూర్తిగా క్రిమిసంహారక మందులతో శుభ్రపరిచారు. మద్యం తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అతణ్ని ఈ మధ్య కలిసిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కొడెర్మా జిల్లాలో 202 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 45 మంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతావారంతా కోలుకొని ఇళ్లకు చేరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని