
తాజా వార్తలు
GHMC: అందుకుందామా ఈ స్ఫూర్తి!
ఇంటర్నెట్ డెస్క్: సీటు కోసం ప్రాణం పెట్టి పోరాడే నాయకులున్న దేశం మనది. అంతేకాదు ఓటు వేయడానికి ఎంత కష్టమైనా ఓర్చి పోలింగ్ బూత్‌కి వచ్చే ప్రజలున్న దేశం కూడా. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఎన్నో ఘటనలు, చిత్రాలు మనకు కనిపిస్తుంటాయి. ఆరోగ్యం బాగోలేకపోయినా, శరీరం సహకరించకపోయినా, వయసు పైబడినా... ఓటు వేయడాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకొస్తుంటారు. అలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొన్ని చిత్రాలు/వీడియోలు కనిపించాయి. ‘ఓటు మన హక్కు... ఓటేయడం మరచిపోకండి’ అని అనుకోవడం కంటే, ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఓటేద్దాం. పది మందికి ఆదర్శంగా నిలుద్దాం. ముందు చెప్పిన స్ఫూర్తిదాయకమైన చిత్రాలు ఇవీ...
కేటీఆర్ మెచ్చి... రిప్లై ఇచ్చి...
గాయాన్ని సైతం లెక్క చేయకుండా...
ఓటు ముందు వైకల్యం ఓడి...
వయసు ఓటేయడానికి అడ్డా?
మూడు తరాలూ ముందుకొచ్చి...
Tags :