పట్టుదలే పెట్టుబడిగా.. వైకల్యాన్ని అధిగమిస్తూ..
close

తాజా వార్తలు

Published : 26/01/2021 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టుదలే పెట్టుబడిగా.. వైకల్యాన్ని అధిగమిస్తూ..

రెండు కాళ్లు లేకపోయినా వ్యవసాయంలో రాణింపు

కరీంనగర్‌: రోడ్డు ప్రమాదం రెండు కాళ్లను పోగొట్టినా ఆయన ఏనాడు బెదరలేదు. రెక్కల కష్టమే ఆసరాగా.. నేలతల్లి మీద ఉన్న ఇష్టంతో వ్యవసాయంలో రాణిస్తున్నాడు. కాళ్లు లేకపోయినా పంట పొలంలో కృషీవలుడిగా శ్రమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కి చెందిన 62 ఏళ్ల బద్దెనపల్లి అంజయ్య. 20 ఏళ్ల కిందట తీర్థయాత్రలకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజయ్య రెండు కాళ్లను కోల్పోయాడు. అదే ప్రమాదంలో పెళ్లీడుకొచ్చిన కూతురి కాలును కూడా తొలగించడంతో ఆయన బాధ రెట్టింపయ్యింది. అయితే వ్యవసాయమంటే ఎనలేని మక్కువ ఉన్న అంజయ్య ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని మళ్లీ బతుకు సాగును ప్రారంభించాడు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవాలంటే తిరిగి వ్యవసాయం చేయాల్సిందేనని నిశ్చయించుకొని ముందుకు సాగుతున్నాడు. పలు పంటలు పండిస్తూ ముగ్గురు సంతానం వివాహం కూడా చేశాడు.

మూడు చక్రాల సైకిల్‌పై పొలం వరకు వెళ్లి అక్కడ ఏర్పాటుచేసుకున్న చిన్నపాటి ఎడ్ల బండిపై వ్యవసాయానికి అవసరమైన పనులను చకచకా చేసుకుంటున్నాడు. ఇతరుల సాయం అవసరం లేకుండానే రెండు ఎద్దులతో పొలాన్ని దున్నడంతోపాటు చదును చేస్తున్నాడు. అతడి కోసమే తామున్నామనేలా ఆ ఎద్దులు కూడా తగిన సహకారాన్ని అందిస్తున్నాయి. సైగలతోపాటు అంజయ్య మాటలకు అనుగుణంగా అవి పనిచేస్తున్న తీరు చూస్తే అబ్బురపడాల్సిందే. సాగులో అధిక దిగుబడులు వచ్చేలా శ్రమిస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు. పొలం పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులకు కూడా వెళుతున్నాడు. సాగు దండగా అనుకొని వ్యవసాయాన్ని దూరం చేసుకుంటున్న ఎందరికో అంజయ్య స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ఇవీ చదవండి...

నాలుగు భాషలు.. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్‌లో..

నా జుట్టు మీద చెయ్యేశావో: అనుశ్రుత్‌ 2.1
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని