close

తాజా వార్తలు

Published : 13/01/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగ్ని పర్వతం (ఇరానీ కథ)

ఆవిడ మనసు పేలేందుకు సిద్ధంగా ఉండే డైనమేట్‌లా ఉంది. బద్దలయ్యేందుకు రగులుతుండే అగ్నిపర్వతంలా ఉంది. దాన్ని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ ఆమెకొచ్చిన కష్టమేంటి?
అడుగుల చప్పుడు వినబడటం లేదు. అడుగుజాడలు సైతం కనబడటం లేదు. కానీ, తెలుసు. ఇక్కడే, ఈ చుట్టుపక్కలే, అంతటా ఉన్నాడు. గాలిలా, సంతూర్‌ వాద్యపు నాదంలా వ్యాపించే ఉన్నాడు. మా మనసుల్లో, స్మృతుల్లో  జీవించే ఉన్నాడు.
అలా అనుకుని సరిపెట్టుకోగలమా? నేను సరిపెట్టుకునే ప్రయత్నంలో సతమతమవుతున్నాను. మరి అమ్మ? ఏం చెప్పినా ఆమె వేదనను తీసివేయగలమా? రగులుతున్న బడబానలాన్ని, నోటితో ‘ఉఫ్‌’ మని ఊది ఆర్పగలనా? 
అమ్మ అలాగే కూర్చుని ఉంది, శూన్యంలోకి తదేకంగా చూస్తూ. రోజులు, వారాలు గడుస్తున్నా నిశ్చేతనంగా! ఆ మౌనానికి అర్థం ఏమిటి? అన్నీ మరచిపోయిందా? లేక ఆ జ్ఞాపకాలన్నీ తుడిచి పెట్టే ప్రయత్నంలో ఉందా? 
మరచిపోవటం అసాధ్యం. ఆ జ్ఞాపకాలను మనసు మూలల్లో అణిచిపెట్టే ప్రయత్నం అది! ప్రమాదకరమైన ప్రయత్నం! నిప్పురవ్వని గుప్పిట్లో బంధించే అమాయక ప్రయత్నం! అలానే ప్రయత్నిస్తూ పోతే, నిలువునా బూడిద చేసే ప్రయత్నం.  
ఆ మనసులో రగులుతున్న అగ్ని పర్వతం బయటికి లావాగా చిమ్మటం లేదు. కానీ, ఎన్నాళ్లిలా? కాలుతూ వస్తున్న  వత్తితో ఉన్న డైనమైట్‌ ఎన్నాళ్లు పేలకుండా ఉండగలదు? అలా పేలక ముందే, ఎలా చల్లార్చాలి ఆమెని? ఆ ఘనీభవించిన మనస్సనే సముద్రంలోంచి ఎలా బయటకు రావాలి ఆ క్షోభ? 
మళ్లీ మళ్లీ... ఎన్నోసారో లెక్క తెలియదు, వెళ్లి ఆ పాత భోషాణాన్ని చిందరవందర చేసి వెతికాను. ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటైనా కనపడలేదు, స్మృతిని వెలిగించే గుర్తు! ఒక చదరంగం పావు, ఒక్క క్యారమ్స్‌ కాయిన్‌గానీ, ఆఖరికి ఆ సంతూర్‌ వాయించిన ప్లాస్టిక్‌ ముక్క.. అది కూడా దొరకలేదు. ఇన్ని వస్తువులతో నిండిన ఈ భోషాణం, ఖాళీగా తోస్తోంది. 
ఏం చెయ్యాలి? ఏదైనా చెయ్యాలి. ఆ వత్తి పూర్తిగా కాలి, డైనమైట్‌ని ఛిద్రం చేయక ముందే, ఏదో ఒకటి చేయాలి! 
లేచి బయటకు నడిచాను. టాక్సీ ఎక్కాను. దారిపొడుగునా రెండువైపులా పేరు తెలియని చెట్లు, భాష తెలియని శబ్దంతో గాలులు పరుస్తున్నాయి. టాక్సీ నెమ్మదిగా ఆగిపోయింది. ఆపేశాడు డ్రైవర్‌.
‘‘ఇక్కడి నుంచి గతుకులు నిండిన మట్టిబాట. టాక్సీ వెళ్లదు’’ చెప్పాడు.  
ఎన్నాళ్లయిందో, తాతగారింటికి వచ్చి. ఎప్పుడూ ఆయన అక్కడకు రావటమే తప్ప, తను ఇటు వచ్చి ఏళ్లు దాటింది. రోడ్డు పరిస్థితి తెలియదు. 
టాక్సీ దిగి, డబ్బులు ఇచ్చేసి, ఆ మట్టి రోడ్డులో నడక సాగిస్తూ, తాతగారిల్లు చేరాను. 
గుమ్మంలోకి అడుగు పెట్టగానే, ఎదురొచ్చాడు తాతయ్య. మట్టికొట్టుకు పోయిన కాళ్లను చూశాడు.
మేము ఉంటున్న పేదల బస్తీ, మునిసిపాలిటీ వాళ్లకి టౌన్‌లో భాగంగా అనిపించదు- టాక్సు లెక్కలు వేసేటప్పుడు తప్ప!

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన