సుందరే లక్ష్యం.. కానీ అతడే ఔట్‌ చేశాడు 
close

తాజా వార్తలు

Published : 16/03/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుందరే లక్ష్యం.. కానీ అతడే ఔట్‌ చేశాడు 

ఇషాన్‌ బ్యాటింగ్‌ ఆశ్చర్యపర్చలేదు.. జేసన్‌ రాయ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మొతేరాలో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) మెరుపు బ్యాటింగ్‌ చూసి తానేమీ ఆశ్చర్యపోలేదని ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అన్నాడు. తాజాగా బ్రిటిష్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌ స్టార్‌ ప్లేయర్‌ అని, ఇదివరకే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అనేకసార్లు ఇలా ఆడాడని రాయ్‌ గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే రెండో టీ20లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టినా అతడి బ్యాటింగ్‌ చూసి ఆశ్చర్యపోలేదని చెప్పాడు.

ఇక ఇంగ్లాండ్‌ ఆటతీరుపై స్పందించిన రాయ్‌.. దూకుడుగా ఆడటమే తాము నియమంగా పెట్టుకున్నామని చెప్పాడు. అయితే, మొతేరా లాంటి పిచ్‌మీద ఆడేటప్పుడు మరింత కచ్చితత్వంతో ఆడాలన్నాడు. పిచ్‌ను త్వరగా ఆర్థం చేసుకోవాలన్నాడు. అయితే, ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌ విఫలమౌతారని చెప్పాడు. కానీ తమకున్న బ్యాటింగ్‌ లైనప్‌ను బట్టి టాప్‌ఆర్డర్‌ ధాటిగా ఆడే అవకాశం ఉందన్నాడు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో(49, 46) నిలకడగా ఆడిన తాను ఇకపై భారీ ఇన్నింగ్స్‌ ఆడాలనుకుంటున్నట్లు రాయ్‌ చెప్పాడు.

‘ఒకే బౌలర్‌ను లక్ష్యం చేసుకొని ఆడాల్సిన పిచ్‌ అది. దురదృష్టంకొద్దీ నేను ఎంపిక చేసుకున్న బౌలరే నన్ను ఔట్‌ చేశాడు. సుందర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆడాలనుకున్నా. కానీ, అతడే ఔట్‌ చేశాడు. ఆ ఓవర్‌లో నేను కొన్ని పరుగులు సాధించి ఉంటే అది మా బ్యాటింగ్‌కు మరింత దూకుడు పెంచేది’ అని ఇంగ్లాండ్ ఓపెనర్‌ పేర్కొన్నాడు. ఇక నేడు జరగబోయే మూడో టీ20లో తమ జట్టు మరింత బలంగా పుంజుకొని ఆడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని