
తాజా వార్తలు
జేసీ ప్రభాకర్‌రెడ్డి న్యాయపోరాటం
అమరావతి: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి అనుమతించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురు గురువారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలు చింపేశారని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా ఎవరైనా అడ్డుకుంటే బాధితులు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేయొచ్చని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Tags :