N440k: చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

N440k: చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్‌440కె అనే కొత్త రకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్‌.ఫకీరప్ప తెలిపారు. శనివారం మీడియాతో ఎస్పీ మాట్లాడారు. కొత్త రకం వైరస్‌ పేరుతో కర్నూలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని న్యాయవాది చేసిన ఫిర్యాదుపై చంద్రబాబుకు రేపు నోటీసులు పంపుతామన్నారు. ఏడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని కోరతామన్నారు. 

‘‘ఎన్‌440కె వేరియంట్‌పై విమర్శించడం వేరు.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం వేరు. కొత్తరకం వైరస్‌పై చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదు అందింది. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు అరెస్టుపై ఇన్వెస్టిగేషన్‌ అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఎన్‌440కె వైరస్‌ ప్రభావం పెద్దగా లేదని సీసీఎంబీ కూడా ప్రకటించింది’’ అని ఎస్పీ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని