దేశ సరిహద్దులను వదిలి.. రైతుల ముందు మేకులా?
close

తాజా వార్తలు

Published : 05/02/2021 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశ సరిహద్దులను వదిలి.. రైతుల ముందు మేకులా?

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శుక్రవారం ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు సాగు చట్టాల అంశాన్ని లేవనెత్తారు. ఆందోళన చేస్తున్న రైతులను ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అవమానించడంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఆ ఘటనకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదు. జాతీయ జెండాను అవమానించిన దీప్‌ సిద్ధూ ఎక్కడ? ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోంది? రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదు’ అని కేంద్రంపై మండిపడ్డారు. 

మరో ఎంపీ, బహుజన్‌ సమాజ్‌పార్టీ నేత సతీశ్‌ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ‘రైతులు దిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డుపై మేకులు ఏర్పాటుచేశారు. కానీ ఇవన్నీ చైనా, పాకిస్థాన్‌ సరిహద్దులో చేయాల్సింది. అది దేశానికి మంచిది కూడా. గత రెండు నెలలుగా రోడ్డెక్కిన అన్నదాతలను ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోంది. వారికి విద్యుత్‌, నీటి సరఫరా నిలిపివేసింది. ఇది మానవహక్కుల ఉల్లంఘన కాదా? ఇకనైనా ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి రైతుల సమస్యలను వినాలి. సాగు చట్టాలను రద్దు చేయాలి’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇవీ చదవండి..

అన్నదాతలపై పోరాటమా!

ఎంపీలకు బారికేడ్లు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని