కమిషనర్‌ సర్‌.. నా ప్రేమను ఒప్పుకోమనండి..!
close

తాజా వార్తలు

Published : 09/03/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమిషనర్‌ సర్‌.. నా ప్రేమను ఒప్పుకోమనండి..!

పౌరుడి ట్వీట్‌.. సీపీ ఏమన్నారంటే

పుణె: సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పాలకులు, అధికారులు చాలా వరకు నెట్టింట్లో ప్రజలకు చేరువగా ఉంటున్నారు. దీంతో పౌరులు కూడా సోషల్‌మీడియాలోనే తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు ఆకతాయిలు అర్థం లేని సమస్యలు చెబుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణె పోలీస్‌ కమిషనర్‌ ముందుకు ఇలాంటి ఓ విన్నపమే వచ్చింది. అయితే దానికి ఆయన చెప్పిన సమాధానం.. నెటిజన్లతో వాహ్వా అనిపించింది. 

LetsTalkCPPuneCity కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ కమిషనర్‌ అమితాబ్‌ గుప్తా సోమవారం కొద్దిసేపు ట్విటర్‌లో ప్రజలతో ముచ్చటించారు. పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ట్విటర్‌ యూజర్‌.. తన స్నేహితురాలు తన ప్రేమను ఒప్పుకునేలా ఏదైనా చేయండి సర్‌ అంటూ సీపీకి ట్వీట్ చేశారు. అయితే అతడి వినతిని అమితాబ్‌ సున్నితంగా తిరస్కరించారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ఆమె అనుమతి లేకుండా మేం ఏ సాయమూ చేయలేం. నువ్వు కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకు. ఒకవేళ ఏదో ఒకరోజు నీ ప్రతిపాదనకు ఆ అమ్మాయి అంగీకరిస్తే నీకు మా అభినందనలు, ఆశీస్సులు ఉంటాయి’’ అని సీపీ ట్వీట్‌ చేశారు. 

కమిషనర్‌ స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ‘చాలా బాగా చెప్పారు’ సర్‌ అంటూ కొందరు కొనియాడారు. ఇలాంటి అర్థం లేని ప్రశ్నలతో పోలీసుల సమయాన్ని వృథా చేయొద్దని మరికొందరు ట్వీట్లు చేశారు. ఇంటరాక్షన్‌లో భాగంగా సీపీ.. మహిళల భద్రత, మాస్క్‌ల వినియోగం, హెల్మెట్లు తదితర అంశాలపై స్పందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని