close

తాజా వార్తలు

Updated : 05/03/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పు చేశాం.. అందులో దాపరికం లేదు: బుగ్గన

అమరావతి: బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువగా అప్పులు చేసిన మాట వాస్తవమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాబడి విపరీతంగా తగ్గిపోయిందని.. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపూ ప్రతిరోజూ కరోనా నియంత్రణ చర్యల కోసమే ప్రభుత్వం రూ.వందలకోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. 

మాది సంక్షేమ ప్రభుత్వం..

తమది సంక్షేమ ప్రభుత్వం కాబట్టే ప్రజలకు పథకాల ద్వారా సహాయం అందజేశామని.. తద్వారా అదే డబ్బును మళ్లీ ఎకానమీలోకి పంపించామని బుగ్గన చెప్పారు. డబ్బు అవసరం ఉన్నందునే అప్పు చేశామనే విషయాన్ని గర్వంగా చెబుతున్నామని, దీనిలో దాపరికమేమీ లేదన్నారు. విపక్షాలు మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో అప్పులంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర ఆర్థిక రంగం క్రమంగా పుంజుకుంటోందని బుగ్గన తెలిపారు. గతం కంటే కేంద్రం నుంచి ఎక్కువగానే నిధులు తెచ్చుకున్నామన్నారు.

ఇప్పటికీ పాత కారే వాడుతున్నా..

కర్నూలు ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలను చేశారని బుగ్గన అన్నారు. వందేళ్లుగా తమ కుటుంబం మైనింగ్‌ రంగంలో ఉందన్నారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తానిప్పటికీ పాత కారే వాడుతున్నానని.. అపార్టుమెంట్‌లోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని