ప్రతిపక్షాలు గెలిస్తే ప్రగతి ఉండదు: వెల్లంపల్లి
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతిపక్షాలు గెలిస్తే ప్రగతి ఉండదు: వెల్లంపల్లి

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80శాతానికి పైగా వైకాపా మద్దతుదారులే గెలిచారని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఆర్యవైశ్యుల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఓసీల్లో వెనుకబడిన కుటుంబాల్లో 45సంవత్సరాలు పైబడిన మహిళలకు ‘జగనన్న చేయూత’ వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్యవైశ్యుల పట్ల సీఎం జగన్‌ సానుకూల దృక్పథంతో ఉన్నారని.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైకాపా గెలుపునకు కృషి చేయాలని వెల్లంపల్లి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి అనేదే లేకుండా పోతుందని మంత్రి అన్నారు. గుంటూరు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వైకాపా విజయం సాధించడం ఖాయమన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని