
తాజా వార్తలు
ప్రధానికి రఘురామకృష్ణంరాజు మరో లేఖ
అమరావతి: 81 కోట్ల మంది పేదల ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ప్రధాని మోదీపై లేఖలో రఘు రామకృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు కేటాయించడంపై ప్రధానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని ఎంపీ కొనియాడారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన నవంబరు వరకు పొడిగించడం గురించీ లేఖలో ఎంపీ ప్రస్తావించారు.
Tags :