తిరుమలలో పెరిగిన భక్తుల సందడి
close

తాజా వార్తలు

Published : 07/02/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలలో పెరిగిన భక్తుల సందడి

తిరుమల: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. దాదాపు ఏడాది తర్వాత తిరుమల క్షేత్రంలో భక్తుల సందడి పెరిగింది. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న తితిదే.. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కావడం, కరోనా ప్రభావం తగ్గడంతో శ్రీవారి దర్శన టికెట్లను దశలవారీగా పెంచుతూ వస్తోంది. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత నెల వరకు ప్రతిరోజు సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారు. ప్రస్తుతం ఉచిత సర్వదర్శన టోకెన్లు 20వేల వరకు ఇస్తుండటంతో భక్తులు రద్దీ క్రమంగా పెరిగింది. వారాంతం కావడంతో భక్తులు ఒక్కసారిగా దర్శనం కోసం బారులు తీరారు. ఆన్‌లైన్‌లో రూ.300 దర్శన టికెట్లు లేకపోవడంతో తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ సమీపంలోని విష్ణునివాసం కేంద్రాల వద్ద శనివారం వరుసల్లో నిలిచి సర్వదర్శనం టోకెన్లు పొందారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 50,200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 25,621 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.11 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ పెరగడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది. 

తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ ప్రభు, తెలంగాణలో పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి  దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 

ఇవీ చదవండి...

ఆ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష!

తొలగించాలన్న చేతిని.. అతికించారు

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని