వైభవంగా శంబర పోలమాంబ జాతర
close

తాజా వార్తలు

Updated : 26/01/2021 20:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైభవంగా శంబర పోలమాంబ జాతర

మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలోని శంబర పోలమాంబ జాతర కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం సుమారు 4 గంటలకు ప్రారంభమైన సిరిమాను ఊరేగింపుగా నడిమి వీధి, పణుకు వీధి, ప్రధాన వీధి, గొల్ల వీధి మీదుగా గద్దె వద్దకు చేరుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో భక్తుల రాకను నియంత్రించేందుకు బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేసేందుకు అధికారులు ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కిలోమీటర్ల మేర నడుచుకుంటూ, ద్విచక్ర వాహనాలు, నాటు బండ్ల ద్వారా అమ్మ సన్నిధికి భక్తజనం చేరుకున్నారు. ఓఎస్‌డీ సూర్యచందర్ రావు ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి..

16 హత్యలు చేసిన సైకో అరెస్టు

దిల్లీలో టెన్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత!  Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని