‘బ్యాంకులను ప్రైవేటీకరించడం దుర్మార్గం’
close

తాజా వార్తలు

Updated : 15/03/2021 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బ్యాంకులను ప్రైవేటీకరించడం దుర్మార్గం’

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక పిలుపుతో దేశ వ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల సమ్మె కొనసాగుతోంది. విజయవాడలోని ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సామాజిక బాధ్యతతో పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో శాశ్వతంగా సమ్మెబాట పడతామని హెచ్చరించారు. తామెందుకు సమ్మె చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని పలువురు బ్యాంకు అధికారులు కోరారు. 

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఫోరం తెలిపింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని