HYD Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో కోఠి, అబిడ్స్‌, బేగంబజార్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌లలో వర్షం పడింది. లక్డికాపూల్‌‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, బాలాజీనగర్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, అల్వాల్‌, తిరుమలగిరి, ప్రగతినగర్‌, నిజాంపేట, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, మాదాపూర్‌తో పాటు కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌లలో వర్షం పడింది. వర్షం పడుతున్నంతసేపు పలుచోట్ల వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద వేచి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంద్దులు పడ్డారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని