
తాజా వార్తలు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్
అమరావతి: నివర్ తుపానుతో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ, వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులు మంగళవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మీట నొక్కి మొత్తం రూ.1,766 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతుల కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించామన్నారు. రైతులకు మంచి ధరలు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.నివర్ తుపాను కారణంగా నవంబరులో 12.01 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. పంటలు నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ రైతులకు అందజేయనున్నారు. ఈ సొమ్మును బ్యాంకులు బాకీల కింద జమ చేసుకోకుండా రైతుల అన్ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులకు ఏదైనా సమస్య వస్తే 155251 నంబరుకు తెలియజేయాలని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి...
వెలగపూడిలో అర్ధరాత్రి అంత్యక్రియలు
న్యాయవ్యవస్థను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు