ఎన్నికల ముందు కేరళలో కాంగ్రెస్‌కు షాక్‌..
close

తాజా వార్తలు

Published : 04/03/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల ముందు కేరళలో కాంగ్రెస్‌కు షాక్‌..

తిరువనంతపురం: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నియోజకవర్గం వయనాడ్‌లో వారం వ్యవధిలో నలుగురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ను వీడారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) మాజీ సభ్యుడు కేకే విశ్వనాథన్‌‌, కేపీసీసీ సెక్రటరీ ఎంఎస్‌ విశ్వనాథన్‌, డీసీసీ జనరల్‌ సెక్రటరీ పీకే అనిల్‌ కుమార్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుజయ వేణుగోపాల్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

కేపీసీసీ నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంఎస్‌ విశ్వనాథన్‌ ఆరోపించారు. అందుకే పార్టీ సెక్రటరీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పీకే అనిల్‌ కుమార్‌ కాంగ్రెస్‌ను వీడిన తర్వాత లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీలో చేరారు. ఎన్నికల వేళ తాజా పరిణామాలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. సమస్య పరిష్కారం కోసం కె.సుధాకరన్‌ సహా పలువురు సీనియర్‌ నేతలను వయనాడ్‌కు పంపింది. 

140 శాసనసభ స్థానాలున్న కేరళలో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ వామపక్ష నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే అగ్రనేత రాహుల్‌గాంధీ పలుమార్లు కేరళలో పర్యటించారు. ఇలాంటి సమయంలో సీనియర్ల రాజీనామాలు పార్టీకి తలనొప్పిగా మారే అవకాశముంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని