close

తాజా వార్తలు

Published : 30/08/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్న ఆరోగ్యం మెరుగవుతోంది: ఎస్పీ చరణ్‌

చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్‌, ఎక్మో సహాయం చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు అడిగిన దానికి ఆయన స్పందిస్తున్నారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా చేస్తున్నాం. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ప్రకటనలో తెలిపింది.

మరోవైపు ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ‘నాన్న ఆరోగ్యం రోజు రోజుకీ మెరగవుతోంది. నిన్నటి పోలిస్తే, ఈ రోజు ఇంకాస్త కోలుకున్నారు. ఇదొక శుభపరిణామం. వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు.’’ అని చరణ్‌ వీడియో సందేశంలో తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన