వైకాపా ఎంపీలకు అర్హత లేదు:తెదేపా
close

తాజా వార్తలు

Updated : 24/03/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా ఎంపీలకు అర్హత లేదు:తెదేపా

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో విఫలమైన వైకాపా ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదని తెదేపా మండిపడింది. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఆపార్టీ తరఫున పనబాక లక్ష్మి ఇవాళ నామినేషన్ వేశారు. అంతకు ముందు నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి తెదేపా నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కీలక నేతలు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు.. పనబాక లక్ష్మికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వైకాపా విఫలమైనందున దిల్లీలో బలంగా గళం వినిపించేందుకు పనబాక లక్ష్మిని గెలిపించాలని వారు కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని