సినీఫక్కీలో ఎస్‌బీఐకి కన్నం..!
close

తాజా వార్తలు

Published : 26/03/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీఫక్కీలో ఎస్‌బీఐకి కన్నం..!

పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో భారీ చోరీ

మంథని గ్రామీణం: సినీ ఫక్కీలో దొంగలు ఓ బ్యాంకుకు కన్నమేశారు. పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మొత్తం రూ.3.10కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. దొంగలు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్‌ తీసేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సైతం బయటపడకుండా సీసీ ఫుటేజీ డీవీఆర్‌ బాక్స్‌ను సైతం వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్‌ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిందితుల కోసం 8 బృందాలు..

వేలిముద్రలు సైతం దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకొని దోపిడీకి పాల్పడ్డారని రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు చెప్పారు. నిందితులకోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్‌, ఏసీపీలు ఉదయకుమార్‌ రెడ్డి, ఉమేందర్‌, సీఐలు మహేందర్‌, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని