
తాజా వార్తలు
టీఎస్: 206 పాజిటివ్ కేసులు.. 346 రికవరీలు
హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు 2,91,872కి చేరగా.. మరణాలు 1579కి పెరిగాయి. తాజాగా మరో 346 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 2,86,244గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,049 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 2,281 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి..
రష్యా టీకా వినియోగానికి బ్రెజిల్ నిరాకరణ!
టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
Tags :