
తాజా వార్తలు
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ముష్కరులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్లో బలగాలు తనిఖీలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి బలగాలు రెండు ఏకే-47 తుపాకులు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
Tags :