శ్రీవారిని దర్శించుకున్న ఉప్పెన చిత్రబృందం
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారిని దర్శించుకున్న ఉప్పెన చిత్రబృందం

తిరుమల: తిరుమల శ్రీవారిని ఉప్పెన చిత్రబృందం ఈ ఉదయం దర్శించుకుంది. నటుడు వైష్ణవ్ తేజ్‌, నటి కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి మెట్లమార్గంలో తిరుమలకు చేరుకున్న బృందం.. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందారు. చిత్రం ప్రేక్షకాదరణ పొందటంతో మొక్కులు చెల్లించుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

వేంకటేశ్వరుడి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు 

తిరుమల వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు వేదాశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.  

వాణీమోహన్‌ ప్రమాణ స్వీకారం.. 

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌అఫీషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.జి.వాణీ మోహన్‌  ఈ ఉదయం ప్రమాణం చేశారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి.. వాణీ మోహన్‌తో ప్రమాణం చేయించారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని