Corona చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చండి
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చండి

ప్రాథమిక బాధ్యతను విస్మరించొద్దు: ఉత్తమ్‌

హైదరాబాద్‌: ఇటీవల కరోనా బారిన పడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆస్పత్రి నుంచి ట్విటర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల దీవెనలతో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయి ఇంటికి వస్తానని పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అన్నారు. కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.  కరోనాను అరికట్టడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు కరోనా బాధితుల కోసం గాంధీ భవన్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌ తెలిపారు. వారందరినీ ఆయన అభినందించారు. కరోనా బారిన పడిన వారికి సరైన వైద్య సేవలు అందక నానా ఇబ్బందులు పడుతుండటం అత్యంత బాధాకరమన్నారు. ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లేక, వెంటిలేటర్లు, ఔషధాలు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు దొరక్క కొవిడ్‌ బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 




Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని