‘నా భర్త గిలగిలా కొట్టుకుని చనిపోయారు’
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నా భర్త గిలగిలా కొట్టుకుని చనిపోయారు’

ఆక్సిజన్‌ సౌకర్యం లేకున్నా ఆస్పత్రిలో చేర్చించుకున్నారు

విశాఖ మహిళ కన్నీరుమున్నీరు

విశాఖ: ఆక్సిజన్‌ సౌకర్యం లేకున్నా కరోనా బాధితుడైన తన భర్తను చేర్పించుకుని ఆయన మరణానికి ఓ ప్రైవేటు ఆస్పత్రి కారణమైందని విశాఖకు చెందిన మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటసేపు ఆక్సిజన్‌ అందక తన భర్త గిలగిలా కొట్టుకుని చనిపోయారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

ప్రస్తుతం వేరే ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఆ మహిళ.. తనతో పాటు తన పిల్లలకు దిక్కెవరని రోదిస్తున్నారు. చికిత్స సమయంలో తన భర్తకు సరైన మందులు, తిండి అందివ్వలేదని ఆరోపించారు. ఆక్సిజన్‌ లేనప్పుడు ఎందుకు చేర్పించుకున్నారని నిలదీశారు. తన భర్తను అనవసరంగా పొట్టన పెట్టుకున్నారని ఆమె విలపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని