close

తాజా వార్తలు

Published : 03/03/2021 07:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్య వివాహేతర సంబంధం.. భర్త హత్య

హైదరాబాద్‌: భార్య వివాహేతర సంబంధం భర్త హత్యకు దారి తీసింది. పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ (35) 3 నెలల క్రితం వచ్చి అమీన్‌పూర్‌ పరిధి సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌పార్కులో స్నేహితుడు హరినారాయణతో కలిసి సెంట్రింగ్‌ కూలీగా పనిచేస్తున్నాడు.

 అనిల్‌ భార్యకు, తోడళ్లుడు నరోత్తం కుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరూ అనిల్‌కుమార్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. పది రోజుల క్రితం నరోత్తం కూడా ఇక్కడికి వచ్చి కూలీగా చేరాడు. ఆదివారం అనిల్‌కుమార్‌ను స్థానికంగా ఉన్న గుట్టల్లోకి తీసుకుపోయి బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. రెండు రోజులుగా అనిల్‌ కనిపించకపోవడంతో అతని స్నేహితుడు హరినారాయణ.. నరోత్తంను గట్టిగా నిలదీయడంతో హత్య చేసినట్లు చెప్పాడు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య, నరోత్తం కుమార్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని