నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యం
close

తాజా వార్తలు

Published : 04/02/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యం

నామినేషన్‌కు వెళ్లిన అభ్యర్థికి అడుగడుగునా అడ్డంకులు

సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధిపురం పంచాయతీలో వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. భాజపా మద్దతదారును నామినేషన్‌ వేయనీయకుండా అడుగడుగునా అడ్డు తగిలారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపురం సర్పంచ్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడి వైకాపా వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో వారి తరఫున గురువారం (ఆఖరిరోజు) వరకు ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భాజపా మద్దతుదారు నెల్లూరు సుశీలమ్మ తన భర్త నరసయ్యతో కలిసి నామినేషన్‌ వేసేందుకు సిద్ధిపురం సచివాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో వైకాపా నాయకులు పత్రాలను దౌర్జన్యంగా లాక్కొని వెళ్లారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో తిరిగి నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుని 4.45 గంటలకు పోలీసులతో నామినేషన్‌ కేంద్రానికి వచ్చారు. ఈక్రమంలో వైకాపా మండల కన్వీనర్‌ రఘునాథరెడ్డి వారికి అడ్డు తగిలారు. ఎస్సై శ్రీకాంత్‌ జోక్యం చేసుకొని అడ్డు తొలగించి నామినేషన్‌ వేసేందుకు తీసుకు వెళ్తుండగా ఆ పత్రాలను సమర్పించే గదిలోకి వెళ్లకుండా వైకాపా నేతలు లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టించారు.

దీంతో భాజపా మద్దతుదారు సుశీలమ్మ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు ఎస్సై గదిలో ఉన్న అధికారులతో మాట్లాడి తలుపులు తీయించి లోపలికి తీసుకెళ్లారు. అయితే వైకాపా నాయకులు మళ్లీ అక్కడికి వెళ్లి అధికారిణిని బెదిరించారు. 4.50 గంటలకు లోపలికి వస్తే ఎలా నామినేషన్‌ స్వీకరిస్తారు? మీరు తెదేపా ఏజెంట్లు అంటూ కేకలు వేశారు. చివరికి సమయం అయిపోయిందంటూ ఆమె నామినేషన్‌ పత్రాలను తీసుకునేందుకు ఎన్నికల అధికారి మల్లికార్జున్‌ నిరాకరించారు. దీంతో సుశీలమ్మ అక్కడే కంటతడి పెట్టుకున్నారు. సమయం ఉన్నా తనను నామినేషన్‌ వేయనీయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెం సీఐ సురేశ్‌ బాబుకు తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ మొత్తం ఘటనలో అధికారులు దౌర్జన్యకాండను చూస్తూ ఉండిపోవడం గమనార్హం. దీంతో సిద్ధిపురంలో నామినేషన్‌ దాఖలుకు గడువు ముగిసేసరికి ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. 

 

ఇవీ చదవండి..

అవంతి.. సూటిగా ప్రశ్నిస్తున్నా: వెలగపూడి

చివరి నిమిషం వరకు ప్రయత్నించారు: నిమ్మగడ్డ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని