Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177033
            [news_title_telugu_html] => 

ఎగరని ఆశలు!

[news_title_telugu] => ఎగరని ఆశలు! [news_title_english] => [news_short_description] => రాష్ట్ర రాజధానిలో శంషాబాద్‌ విమానాశ్రయం తప్ప మరే జిల్లాలోనూ కొత్తగా ఏర్పాటుకాలేదు. కొత్తవాటి ప్రతిపాదనలు 11 ఏళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. పలు దఫాలు సర్వేలు జరిగినా ప్రయోజనం శూన్యం. తాజాగా జాతీయ విమానాశ్రయాల [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ఎగరని ఆశలు! - EENADU
close
ఎగరని ఆశలు!

 11 ఏళ్లుగా ఒక్కటీ సాకారం కాలేదు
 అధ్యయనాలతో గడుస్తున్న కాలం
 రాష్ట్రానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టే దిక్కు
 కేంద్రం వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి
 విమానాశ్రయాల ప్రాధికార సంస్థ  తాజా సర్వే ప్రారంభం

తెలంగాణ జనాభా 3.5 కోట్లు..
విమానాశ్రయం 1..

రాష్ట్ర రాజధానిలో శంషాబాద్‌ విమానాశ్రయం తప్ప మరే జిల్లాలోనూ కొత్తగా ఏర్పాటుకాలేదు. కొత్తవాటి ప్రతిపాదనలు 11 ఏళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. పలు దఫాలు సర్వేలు జరిగినా ప్రయోజనం శూన్యం. తాజాగా జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా-ఏఏఐ) సాంకేతిక సంభావ్యత అధ్యయనం (టెక్నో ఫీజిబిలిటీ సర్వే) చేపట్టింది. దీనికి అవసరమైన రుసుము చెల్లించాలని రాష్ట్రానికి సూచించింది. సర్వేల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోందంటూ అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రుసుము చెల్లించలేదు. అయినప్పటికీ ఏఏఐ తన అధ్యయనాల్లో భాగంగా బుధవారం నుంచి సర్వే ప్రారంభించింది.

ఆరుచోట్ల అభివృద్ధికి అవకాశం

తెలంగాణలోని ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి అవకాశం ఉంది. జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో హరిత కేటగిరీ, బసంత్‌నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో బ్రౌన్‌ కేటగిరీలో విమానాశ్రయాలను నిర్మించవచ్చు. ఇప్పటికే వరంగల్‌, ఆదిలాబాద్‌లలో విమానాల విడిది సౌకర్యం ఉంది. బసంత్‌నగర్‌లోని రామగుండం విమానాశ్రయానికి వాయుదూత్‌ విమానాలు నడిచాయి. జక్రాన్‌పల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌కు విమానాశ్రయాల అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటికి అవసరమైన భూములను ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ విమానాశ్రయాలు శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉన్నందున నిర్మాణాలకు సమస్య లేదు. కేంద్రం విమానాశ్రయాలను మంజూరు చేసిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వాటిని పూర్తి చేసే వీలుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనూ వీటిని చేపట్టవచ్చు.

12 విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు

* తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 12 ప్రాంతీయ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి నివేదించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కలిసి విన్నవించారు.
* వరంగల్‌ జిల్లా మామునూరు మొదలుకొని కొత్తగూడెంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని ఏఏఐ పలుమార్లు సందర్శించి నివేదికలను రూపొందించింది.
* వరంగల్‌ జిల్లా మామునూరు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలో అధ్యయనం చేసింది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, రామగుండం సమీపంలోని బసంత్‌నగర్‌లలో అధ్యయనం చేయాల్సి ఉండగా బుధవారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సర్వే చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే సత్వర నిర్మాణం
-కాసం వెంకటేశ్వర్లు, ఏఏఐ సభ్యుడు

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వెంటనే విమానాశ్రయాల నిర్మాణం చేపడతాం. ఏపీలో అయిదేళ్లలో అయిదు విమానాశ్రయాలను అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి చొరవ చూపాలి. ఏఏఐ సర్వే రుసుం రూ.4.5 కోట్లను ఇప్పటి వరకూ చెల్లించలేదు. 20 శాతం నిధులను డిపాజిట్‌ చేయాలంటే రూ.90 లక్షల చెక్కు మాత్రమే ఇచ్చారు. నిధులు విడుదల చేయలేదు. భూకేటాయింపులు ఇతర చర్యలు చేపట్టాలి.

సహకరిస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఏఏఐకి పూర్తిగా సహకరిస్తున్నామని చెబుతున్నాయి. ఏఏఐ బృందానికి అవసరమైన సమాచారం ఇస్తున్నామని తెలిపాయి. సలహా రుసుమును విడుదల చేస్తామని వెల్లడించాయి. సర్వే నిధులు అంత ప్రాధాన్యాంశం కాకపోయినా వాటి కోసం ఒత్తిడి తేవడం సరికాదనే భావన రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.