Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177041
            [news_title_telugu_html] => 

దాటితే గీత భారీ వాత

[news_title_telugu] => దాటితే గీత భారీ వాత [news_title_english] => [news_short_description] => నిబంధనలను అతిక్రమించిన వాహనదారుల జేబులు ఇక ఖాళీనే. ప్రస్తుతం వసూలు చేస్తున్న అపరాధ రుసుములను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. ఆ చట్టం ప్రకారం రవాణా నిబంధనలు కఠినతరమయ్యాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/vL5rOBYpuCc [news_videoinfo] => |https://www.youtube.com/embed/vL5rOBYpuCc [news_sections] => ,27,26, ) )
దాటితే గీత భారీ వాత - EENADU
close
దాటితే గీత భారీ వాత

సెప్టెంబరు 1 నుంచే అమలు
  ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై అపరాధ రుసుముల మోత
  మద్యం మత్తులో వాహనం నడిపితే రూ.10,000 జరిమానా
  దశల వారీగా నూతన నిబంధనల అమలు

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలను అతిక్రమించిన వాహనదారుల జేబులు ఇక ఖాళీనే. ప్రస్తుతం వసూలు చేస్తున్న అపరాధ రుసుములను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. ఆ చట్టం ప్రకారం రవాణా నిబంధనలు కఠినతరమయ్యాయి. వాటిని దశలవారీగా అమలు చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, రహదారి భద్రతా నిధి, ప్రైవేటు క్యాబ్‌ వ్యవస్థల స్థిరీకరణ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురానుంది.

అధిక బరువు భారమే
అధిక బరువు(ఓవర్‌ లోడ్‌)తో నడిచే సరకు రవాణా వాహనాలు, ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్లను ఎక్కించుకుని నడిపే వాహనాలకు భారీగా రుసుం వడ్డించనుంది. సరకు రవాణా వాహనాలు అధిక బరువుతో పట్టుపడిన పక్షంలో ప్రస్తుతం రూ.రెండు వేలు అపరాధ రుసుముగా, ప్రతి అదనపు టన్నుకు రూ.వెయ్యి అదనంగా వసూలు చేసేవారు. ఆ మొత్తాన్ని రూ.ఇరవై వేలకు పెంచారు. అదనపు బరువు టన్ను ఒక్కింటికి రూ.రెండు వేలుగా నిర్ణయించారు. అధికసంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కొక్కరికి రూ.వెయ్యి అపరాధ రుసుముగా వసూలు చేయనున్నారు. ద్విచక్ర వాహనంపై అధిక బరువును వినియోగిస్తే రూ.రెండు వేల అపరాధ రుసుముతోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారు. గతంలో రూ.వంద రుసుముగా విధించేవారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.