
భూతాపంతో బాల్యానికి పొంచి ఉన్న ముప్పు
మేల్కోకుంటే ఒక తరం మొత్తంపై ప్రభావం
భారత్ వంటి దేశాల్లో తీవ్ర నష్టం
అంతర్జాతీయ నివేదిక హెచ్చరిక
దిల్లీ: ఇప్పటి పెద్దలు చేస్తున్న తప్పులకు భవిష్యత్తులో చిన్నారులు భారీ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. భరించలేని ఎండలబారిన పడాల్సి వస్తుంది. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచంలో.. ముఖ్యంగా భారత్‌లో ఒక తరంలోని చిన్నారులందరి ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని ఓ అధ్యయనం హెచ్చరించింది. ఇంధన వినియోగ తీరుతెన్నులను మార్చుకొని భూతాపాన్ని కట్టడి చేయకుంటే ఆహార కొరత, అంటువ్యాధులు, వరదలు, తీవ్ర స్థాయి వడగాల్పులు వంటివి విజృంభిస్తాయని స్పష్టంచేసింది. 41 కీలక సూచికలపై ఏటా పరిశీలనలు సాగించి ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ పేరుతో ఈ అధ్యయనం సాగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా 35 సంస్థలకు చెందిన 120 మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు. దీని నివేదిక ప్రముఖ మ్యాగజైన్ ‘లాన్సెట్’లో ప్రచురితమైంది. దాని సారాంశమిదీ..
* పారిస్ వాతావరణ ఒప్పందంలోని లక్ష్యాలకు అనుగుణంగా భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా బాగా తక్కువకు పరిమితం చేయకుంటే మొత్తం ఒక తరం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఈ పభావం శిశువులు, చిన్నారులపైనే ఎక్కువగా ఉంటోంది. |
* కర్బన ఉద్గారాలకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే.. ప్రస్తుతం జన్మించే చిన్నారులకు 71 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువకు పెరిగిపోతాయి. ఫలితంగా జీవితంలోని ప్రతి దశలోనూ వారికి ఇబ్బందులు తప్పవు. |
* ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, మారుతున్న వర్షపాత తీరుతెన్నుల వల్ల విజృంభించే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు కూడా చిన్నారులకే ఎక్కువ. ప్రపంచ జనాభాలో సగం మేర ఇప్పుడు ఈ వ్యాధి ముప్పును ఎదుర్కొంటోంది. ఉబ్బసం, గుండెపోటు, పక్షవాతం వంటివి కూడా పొంచి ఉంటాయి. |
* గత మూడు దశాబ్దాల్లో చిన్నారుల్లో డయేరియా ఇన్ఫెక్షన్ కాలం రెట్టింపైంది. |
కార్చిచ్చు.. ఆరోగ్యానికి చిచ్చు.. నేడు జన్మించే చిన్నారులు తర్వాతి దశల్లో తీవ్ర వరదలు, దీర్ఘకాల కరవులు, కార్చిచ్చు వంటివి ఎక్కువగా చవిచూస్తారు. మొత్తం 196 దేశాలకు గాను 152 దేశాల్లో 2001-2004 నుంచి కార్చిచ్చు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. |
కార్చిచ్చుతో ఎదురైన సమస్యలు మరణాలు, శ్వాసకోశ ఇబ్బందులతో పాటు నివాసాలను కోల్పోవడం వంటివి.. |
భారత్‌కు ముప్పు ఎక్కువ అధిక జనాభా, ఆరోగ్య పరిరక్షణల్లో తీవ్ర అసమానతలు, పేదరికం, పోషకాహార లోపం వంటి సమస్యలున్న భారత్ వంటి దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందని తాజా నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్న పూర్ణిమా ప్రభాకరన్ చెప్పారు. భారత్‌లో డయేరియా సంబంధ ఇన్ఫెక్షన్లతో చిన్నారుల్లో మరణాలు పెరుగుతున్నాయన్నారు. 2015లో వేల మందిని బలతీసుకున్న వడగాల్పులు ఇక తరచూ సంభవించొచ్చని తెలిపారు. |
2.1 కోట్ల మంది భారత్‌లో కార్చిచ్చు ప్రభావానికి గురైన వారి సంఖ్య |
ముఖ్యాంశాలు
దేవతార్చన

- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి