close

తాజా వార్తలు

ఆడపిల్లలు సహా నన్ను విక్రయించారు 

భర్త, అత్తమామలపై మహిళ ఆరోపణ 
తప్పుడు ఆరోపణలుగా కొట్టేసిన ఫలక్‌నుమా ఏసీపీ

కేశవగిరి, చంచల్‌గూడ, న్యూస్‌టుడే: భర్త, అత్తమామలు తనతోపాటు తన ఇద్దరు ఆడపిల్లలను ఇతరులకు విక్రయించారని ఓ మహిళ ప్రజాసంఘాలను ఆశ్రయించడం చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో కలకలం రేపింది. బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన ఫజల్‌ రహమాని(25)కు 2016లో ఇష్రత్‌ పర్వీన్‌ (22)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గతంలో పర్వీన్‌ దక్షిణ మండలం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో ఫజల్‌ తన తల్లిదండ్రులతో వేరేచోట నివసిస్తున్నాడు. భర్త, అత్తమామలు వెళ్లిపోయిన తర్వాత పర్వీన్‌ తన తల్లి, మరో చెల్లెలితో అదే ఇంట్లో ఉంటోంది. ఫజల్‌ పేరున ఉన్న ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేయగా ఫజల్‌ ఒప్పుకోకపోవడంతో పర్వీన్‌, ఆమె తల్లి, సోదరి ఫజల్‌పై 2 నెలల క్రితం దాడిచేశారు. చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఫజల్‌ ఆ ఇంటిని సర్ఫరాజ్‌కు విక్రయించాడు. ఇల్లు ఖాళీ చేయాలని శుక్రవారం సర్ఫరాజ్‌ కోరడంతో వివాదం తలెత్తింది. మళ్లీ పర్వీన్‌ ఫిర్యాదుతో చాంద్రాయణగుట్ట పోలీసులు సర్ఫరాజ్‌పై కేసుపెట్టారు. మరోవైపు ఆదివారం సాయంత్రం న్యూమలక్‌పేట పీయూసీఎల్‌ కార్యాలయంలో పీయూసీఎల్‌ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది జయ వింధ్యాల మాట్లాడుతూ.. డబ్బులకు పిల్లలను అమ్మేశారంటూ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇల్లు చేజారుతుందనే భావనతో పర్వీన్‌ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, అందులో వాస్తవం లేదని ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ ఎం.ఎ.రషీద్‌ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.