close

తాజా వార్తలు

25ఏళ్ల తర్వాత అక్కడ భాజపా ఓడిపోయింది

 

పనాజీ: సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న భాజపాకు గోవాలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో మాత్రం షాక్‌ తగిలింది. గత రెండున్నర దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న పనాజీలో కమలం పార్టీ నేడు ఓటమి చవిచూసింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మనోహర్‌ పారికర్‌ ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో పనాజీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో భాజపా సిద్ధార్థ్‌ కున్‌కోలియెంకర్‌ను బరిలోకి దింపింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో సిద్ధార్థ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి అటనాసియో మాన్సరేట్‌ 1700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

గత 25ఏళ్లుగా ఇక్కడ భాజపా ప్రాతినిథ్యం వహంచింది. 1994లో పారికర్‌ తొలిసారిగా గెలుపొందారు. అప్పటి నుంచి 2014 వరకూ గెలుస్తూ వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా చేశారు. పారికర్‌ రక్షణమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధార్థ్‌ కున్‌కోలియెంకర్‌ భాజపా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ  ఉపఎన్నికలో పారికర్‌ మళ్లీ పనాజీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.